కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం చవిచూడటాన్ని దుమ్మెత్తిపోసిన పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. న్యూజిలాండ్‌తో వరుస రెండు టీ20లను విరాట్ గ్యాంగ్ గెలుచుకున్న తర్వాత ఆకాశానికెత్తేశాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో మొదటి రెండు టీ20లను భారత్ గెలుచుకున్న తీరు అబ్బురపరిచిందన్నాడు.. అసలు భారత్‌కు న్యూజిలాండ్ దాసోహం అయిపోయినట్లే కనబడిందన్నాడు. భారత్ జట్టుకు సమాధానం ఇవ్వడానికి కివీస్ వద్ద సమాధానమే లేకుండా పోయిందని అక్తర్ పేర్కొన్నాడు. ‘ రెండో టీ20 చూడండి. కివీస్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన టీమిండియా తరహా జట్టు ముందు ఆ స్కోరుతో ఎలా పోరాడతారు. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటింగ్ చేసిన తర్వాత విజయం టీమిండియాదేనని ఫిక్స్ అయ్యింది. కివీస్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేసిన క్రెడిట్ భారత బౌలింగ్ యూనిట్‌ది. ఒకవైపు పేసర్లు, మరొకవైపు స్పిన్నర్లు కివీస్‌కు చుక్కలు చూపించారు.
‘బుమ్రా, షమీ.. మీ కాన్ఫిడెన్స్ సూపర్’